Today Horoscope : 12-05-2021 బుధ వారం నేటి రాశిఫలాలు….ఈ రాశి వారికీ ఊహించని ధన సహాయం అందుతుంది.

Today Horoscope : 12-05-2021  బుధ వారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (12-05-2021) రాశి ఫలితాలు

మేషం :

గృహమున సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగవిషయమై అధికారులతోసంప్రదింపులు చేస్తారు.

వృషభం :

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృధా ఖర్చులు చేస్తారు వ్యాపార వ్యవహారాలలో ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

మిధునం :

సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం :

ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి.వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం :

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం విషయంలో నిరాశ తప్పదు నిరుద్యోగ ప్రయత్నాలు మధ్యలో నిలిపి వేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య :

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు బంధు వర్గం వారితో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

తుల :

సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబసభ్యుల నుండి ఆశ్చర్యకరమైనవిషయాలు తెలుస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం :

నూతనఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్త్రా ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి విక్రయాలలో లాభాలుఅందుతాయి. వ్యాపారఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు :

ముఖ్యమైనపనులుమందకొడిగాసాగుతాయి. మానసిక ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

మకరం :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆప్తుల నుండి అందిన సమాచారం కొంతబాధ కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమతో కూడినవిగ ఉంటాయి. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభం :

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మీనం :

ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దాయాదులతో భూవివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 12-05-2021 బుధ వారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage