2024-07-27 05:47:58
Today Horoscope : 12-06-2021 శనివారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 12-06-2021 శనివారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 12-06-2021 శనివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (12-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలలో ఇతరుల సహాయం అందుతుంది.

వృషభ రాశి (Taurus) :

ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృత్తి ఉద్యోగాలలో శ్రమ మరింత పెరుగుతుంది.నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

మిధున రాశి (Gemini) :

దీర్ఘకాలిక రుణాలు తీర్చి ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer) :

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక నష్టాలు సూచనలు ఉన్నవి.

సింహ రాశి (Leo) :

చాలా కాలంగా కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి.

కన్య రాశి (Virgo) :

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.గృహవాతావరణం సందడిగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

తుల రాశి (Libra) :

గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలనుండి కొంత ఉపశమనం పొందుతారు వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) :

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది.వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి (Sagitarus) :

సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి (Capricorn) :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో పడిన కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి.ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వాతావరణం అంతంత మాత్రంగా సాగుతుంది.

కుంభ రాశి (Aquarius) :

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు ఉండవు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై సహోద్యోగుల సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 12-06-2021 శనివారం… నేటి పంచాంగం..

Also Read : Nandamuri Balakrishna : బాలయ్యకు ఇప్పటికీ కలగా మిగిలిపోయిన ఆ ఒక్క సినిమా
తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage