Today Horoscope: ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. (10-11-2023)

Today Horoscope: ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. (10-11-2023)

SREE KRUPA (10-11-2023) రాశి ఫలితాలు

మేషం: దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.

మిధునం: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

సింహం: ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

వృశ్చికం: ధనాదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు: చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం: సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభం: అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.

మీనం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

Today Horoscope
SREE KRUPA

Also Read:
  Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును!
Weekly Horoscope : ఈ రాశివారికి నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
 For More Updates Follow us on – Sirimalli Page