2024-07-27 05:48:40
Today Horoscope : 09-07-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 09-07-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 09-07-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (09-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం మరింత గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.

వృషభ రాశి (Taurus) :

చేపట్టిన పనులు మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున సన్నిహితులతో కొన్ని విషయాల గూర్చి చర్చిస్తారు. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మిధున రాశి (Gemini) :

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాప్యం తప్పదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి.

కర్కాటక రాశి (Cancer) :

నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగ వాతావరణం మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి కొన్ని పనులలో బంధు మిత్రుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కన్య రాశి (Virgo) :

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

వృశ్చిక రాశి (Scorpio) :

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రతి చిన్న విషయానికి కోపం అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

ధనస్సు రాశి (Sagitarus) :

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ పెరుగుతుంది బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

మకర రాశి (Capricorn) :

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.

కుంభ రాశి (Aquarius) :

చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మీన రాశి (Pisces) :

ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రుణ ఒత్తిడి అధికమౌతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 08-07-2021 శుక్రవారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage