Today Horoscope : 03-06-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 03-06-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA (03-06-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు సంఘంలో పెద్దల నుంచి రాజకీయా ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో నూతన అవకాశములు అందుతాయి.

వృషభం (Taurus) :

కుటుంబ సభ్యులు ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం (Gemini) :

బంధు మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు ఆకస్మిక ధన వ్యయం సూచనలున్నవి. కుటుంబ సభ్యులు నుండి అవసరానికి సహాయం అందదు. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం (Cancer) :

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగి నిలిచిపోతాయి. ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ సందర్శనాలు చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు చేజారుతాయి.

సింహం (Leo) :

చిన్ననాటి మిత్రులతో పాత విషయాలలో చర్చలు చేస్తారు. గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబమున కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.

కన్య (Virgo) :

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత ఉత్సాహకార వాతావరణం ఉంటుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలుంటాయి.

తుల (Libra) :

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు పెరుగుతాయి చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగాసాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

వృశ్చికం (Scorpio) :

అవసరానికిచేతిలో డబ్బు నిలవదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు కలుగుతాయి. దూరప్రాంత బంధువులు నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది బాధిస్తుంది వృత్తి,ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి వ్యాపారమున భాగస్థుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

ధనస్సు (Sagitarus) :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం (Capricorn) :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టి నష్టపడతారు సంతాన విషయాలలో నూతన సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం (Aquarius) :

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలించి నూతన అవకాశములు అందుతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం (Pisces) :

కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అధిక కష్టంతో స్వల్ప లాభం పొందుతారు. ఆకస్మికప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో జాగ్రత్త వ్యవహరించాలి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 03-06-2021 గురువారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage