2024-07-27 15:48:29
Today Horoscope : 01-07-2021 గురువారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 01-07-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 01-07-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (01-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి దీర్ఘ కాలిక రుణఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధు మిత్రుల వలన కొన్ని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.

వృషభ రాశి (Taurus) :

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి బంధు మిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు.

మిధున రాశి (Gemini) :

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి.

కర్కాటక రాశి (Cancer) :

ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలు అందుతాయి.

సింహ రాశి (Leo) :

దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలలో ఒత్తిడి పెరిగి నిరాశ తప్పదు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తిఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత ఒత్తిడి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఒడిడుకులు తప్పవు.

Sree Krupa
Sree Krupa

కన్య రాశి (Virgo) :

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి .నూతన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. నిరుద్యోగులుకు అప్రయత్నంగా అవకాశములు లభిస్తాయి.

తుల రాశి (Libra) :

ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు శత్రు సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio) :

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు రావలసిన ధనం సకాలంలో అందదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

కొన్ని పరిస్థితులు సహనాన్ని పరీక్షిస్తాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. సంతానం విద్యా విషయాల పై దృష్టి సారించడం మంచిది.

మకర రాశి (Capricorn) :

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభ రాశి (Aquarius) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి .కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి ఆత్మీయులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.ధనదాయం బాగుంటుంది. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 01-07-2021 గురువారం .. నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage