Off Beat

windows 11 : విండోస్ 11కు మీరు రెడీయా?

windows 11 : విండోస్ 11 వచ్చేస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని, వాడని లేటెస్ట్ ఫీచర్లతో కలర్ ఫుల్ గా ముస్తాబైంది. ఇందులో ఆండ్రాయిడ్ యాప్ లనూ వాడుకోవచ్చు. దీని కోసం ఇంటెల్, అమెజాన్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.(windows 11)

విండోస్ 11కు అమెజాన్ యాప్ స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్ అందిస్తే… అవి పనిచేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటెల్ బ్రిడ్జ్ సమకూర్చబోతోంది. విండోస్ 11కు ఆండ్రాయిడ్ యాప్స్ తోడైతే… ఇక కేకే.

 

How to make Windows 10 look like Windows 11 || Windows 11 Theme For Windows 10 - YouTube

ఐదేళ్ల తర్వాత విండోస్ ప్లాట్ ఫామ్ లో భారీ మార్పులు చేశారు. సరికొత్త ఫీచర్లు, లేటెస్ట్ డిజైన్ తో పాటు, ఈజీ ఉండేలా విండోస్ 11 రూపొందించారు. అంతేకాదు… ఒకేసారి ఎన్నో పనులు చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ హిస్టరీలోనే ఇది ఒక వండర్ ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెబుతున్నారు.

కరోనా దెబ్బకు ఇప్పుడు క్లాసులైనా, మీటింగులైనా… అన్నీ ఆన్ లైనే. జూమ్, సిస్కో వంటి యాప్స్ సాయంతో పనులన్నీ లైవ్ ద్వారా జరిగిపోతున్న కాలమిది. భవిష్యత్తులో కూడా ఇవి తప్పకపోవచ్చు. అందుకే… ఈజీగా మీటింగుల్లో పాల్గొనడానికి విండోస్ 11కు టీమ్స్ అనే యాప్ జత చేశారు.

Why Windows 11 Will Likely Be a Free Upgrade from Windows 10 | Digital Trends

విండోస్ 11 స్టార్ట్ మెనూలోనే టీమ్స్ యాప్ కనిపిస్తుంది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా, ఏ సమయంలో అయినా, ఎవరితో అయినా… టెక్స్ట్‌, ఛాట్‌, వాయిస్‌, వీడియో ద్వారా కనెక్ట్‌ అయిపోవచ్చు. ఒకవేళ మీరు కనెక్ట్ కావాలని అనుకునేవాళ్లు టీమ్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే… జస్ట్ ఓ ఎస్సెమ్మెస్ పంపి కనెక్ట్ అయిపోవచ్చు.

ఏదైనా లైవ్ మీటింగులో ఉన్నప్పుడు ఎవరికైనా పని పడితే… వాళ్ల వల్ల సమావేశానికి ఇబ్బంది లేకుండా… టాస్క్ బార్ నుంచే టీమ్స్ యాప్ ను మ్యూట్, అన్ మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు.

ఇప్పటికే ఉన్న కంప్యూటర్లలో విండోస్ 11 ఇన్ స్టాల్ చేసుకోవాలంటే… మినిమమ్ కాన్ఫిగరేషన్ తప్పనిసరి. 4GB ర్యామ్ తో పాటు, కనీసం 64GB మెమరీ, 64 బిట్ సీపీయూ ఉండటంతో పాటు… పీసీకి తప్పనిసరిగా టీపీఎం సెక్యూరిటీ చిప్ ఉండాలి. డేటా సెక్యూరిటీ కోసమే టీపీఎం సెక్యూరిటీ చిప్ తప్పనిసరి చేసినట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

Windows 11 Will Be a Free Upgrade, But the System Requirements Are Going Up | PCMag

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు మైక్రోసాఫ్ట్ నిర్దేశించిన మినిమమ్ కాన్ఫిగరేషన్ కలిగిన ప్రతీ పీసీలోనూ విండోస్ 11ను ఫ్రీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మీ పీసీ విండోస్ 11ను సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ చెక్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లో కమింగ్ సూన్ అని చూపిస్తోంది.

How check whether your laptop, desktop is compatible with Windows 11 in few simple steps

https://www.microsoft.com/en-in/windows/windows-11 సైట్లో హెల్త్ చెక్ యాప్ అందుబాటులోకి వచ్చాక… దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అది పూర్తయ్యాక OPEN WINDOWS PC HEALTH CHECK ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే… CHECK NOW విండో ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే… మీ పీసీ విండోస్ 11ను సపోర్ట్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది.

సరికొత్త స్నాప్ లేఔట్స్, స్నాప్ గ్రూప్స్, డెస్క్ టాప్స్ ద్వారా… ఒకేసారి చాలా పనులు చేసుకునే సదుపాయం విండోస్ 11లో అందుబాటులోకి రాబోతోంది. విభిన్నమైన డెస్క్ టాప్ లను సృష్టించుకోవడమే కాదు… మన అవసరాలకు తగినట్లుగా… అంటే చదువుకోడానికి, గేమ్స్ ఆడటానికి, పని చేసుకోవడానికి సెపరేట్ డెస్క్ టాప్ లను క్రియేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Jasmin Bhasin : కత్తి లాంటి సొగసు.. కిర్రెక్కించే వయసు.. బిగ్ బాస్ భామ జస్మిన్ సొంతం.

DirectX 12 compatible graphics / WDDM 2.x గ్రాఫిక్స్ కార్డును విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు… ఆటో HDR ఉండటం వల్ల… వీడియో చాలా Cristal Clearగా ఉంటుంది. గేమ్ అసెట్స్ కూడా సీపీయూ నుంచి కాకుండా నేరుగా గ్రాఫిక్ కార్డ్స్ మీదే లోడ్ చేసుకోవచ్చు. స్పీడ్ గా లోడ్‌ చేసుకోడానికి డైరెక్ట్‌ స్టోరేజ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

Find out if your PC is compatible with Windows 11 - gHacks Tech News

విండోస్ 11లో మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే… ఎక్స్ బాక్స్ బిల్టిన్ గా వస్తోంది. దీని ద్వారా ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ ఉన్న వాళ్లంతా వందకు పైగా హై క్వాలిటీ గేమ్స్ యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. గేమర్స్ కు ఇంతకంచే కావాల్సింది ఏముంటుంది!

ఇక విడ్జెట్లు కూడా విండోస్ 11కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. సెల్ ఫోన్లలో లాగే… ఇకపై డెస్క్ టాప్ మీద కూడా న్యూస్, వెదర్, క్యాలెండర్, రిమైండర్స్ వంటివి చూసుకోవచ్చు. అన్నింటినీ ఒకేసారి ఫుల్ స్క్రీన్ మీద కూడా చూసుకునే ఫెసిలిటీ ఉంది. అంతేకాదు… కొత్త విడ్జెట్లు యాడ్ చేసుకోవడం, వద్దనుకున్నవి డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

Windows 11: List of Intel, AMD and Qualcomm Processors Compatible and Official Minimum System Requirements - MySmartPrice

సో… ఇవీ విండోస్ 11కు సంబంధించిన విశేషాలు. ఈ లేటెస్ట్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే… వచ్చే ఏడాది దాకా ఆగక తప్పదు. ఎందుకంటే… 2022లోనే విండోస్ 11ను అందుబాటులోకి తీసుకురాబోతోంది… మైక్రోసాఫ్ట్.

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage