2024-07-27 04:44:58
Today Horoscope : ఆ రాశి వారికి బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు ( 30-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు ( 30-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు ( 30-03-2022 )

 

SREE KRUPA (30-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 30-03-2022

Today Horoscope :  ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. దీర్ఘ కాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

వృషభం – 30-03-2022

కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు వృత్తి, వ్యాపారాలలో స్థిరనిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగులకు లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి.

మిధునం – 30-03-2022

సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

కర్కాటకం – 30-03-2022

చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం – 30-03-2022

సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కన్య – 30-03-2022

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

తుల – 30-03-2022

చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.

వృశ్చికం – 30-03-2022

బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ధనస్సు – 30-03-2022

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయం అందుతాయి.

మకరం – 30-03-2022

ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.

కుంభం – 30-03-2022

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మీనం – 30-03-2022

వృధా పెరుగుతాయి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Girish (Purohithulu) sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

 

For More Updates Follow us on – Sirimalli Page