2024-06-22 15:15:03
Today Horoscope : ఆ రాశివారికి బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు (30-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశివారికి బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు (30-04-2022)

Today Horoscope : ఆ రాశివారికి బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు (30-04-2022)

SREE KRUPA (30-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 30-04-2022

Today Horoscope : ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులు తో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

వృషభం – 30-04-2022

నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిధునం – 30-04-2022

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి.

కర్కాటకం – 30-04-2022

వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది.

సింహం – 30-04-2022

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగార్థులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.

కన్య – 30-04-2022

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

తుల – 30-04-2022

స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలుచేసి ఇబ్బందులకుగురిఅవుతారు. ఉద్యోగవాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం – 30-04-2022

ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి.

ధనస్సు – 30-04-2022

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మరింత కష్టంతో గానీ ఫలితం లభించదు.

మకరం – 30-04-2022

ధనదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి.

కుంభం – 30-04-2022

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.

మీనం – 30-04-2022

పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page