2024-07-27 11:07:14
Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం! (29-08-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం! (29-08-2022)

Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం! (29-08-2022)

 

SREE KRUPA (29-08-2022) రాశి ఫలితాలు

మేషం – 29-08-2022

Today Horoscope : చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని పనులలో బంధు మిత్రుల సలహాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

వృషభం – 29-08-2022

స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి.

మిధునం – 29-08-2022

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందటంలో జాప్యం కలుగుతుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం – 29-08-2022

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సింహం – 29-08-2022

అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి మరింత అధికమవుతుంది. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

కన్య – 29-08-2022

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల – 29-08-2022

చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృశ్చికం – 29-08-2022

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ధనస్సు – 29-08-2022

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారమున భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది గృహమున ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు.

మకరం – 29-08-2022

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం – 29-08-2022

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

మీనం – 29-08-2022

భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసే అధికారులు మన్ననలు పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page