2024-07-27 05:54:26
Today Horoscope : ఆ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు (28-09-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు (28-09-2022)

Today Horoscope : ఆ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు (28-09-2022)

 

SREE KRUPA (28-09-2022) రాశి ఫలితాలు

 

మేషం – 28-09-2022

Today Horoscope : దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృషభం – 28-09-2022

నూతన రుణయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. పనులలో శ్రమ తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మిధునం – 28-09-2022

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వ్యతిరేకత పెరుగుతుంది. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కర్కాటకం – 28-09-2022

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

సింహం – 28-09-2022

దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

కన్య – 28-09-2022

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల – 28-09-2022

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు.

వృశ్చికం – 28-09-2022

ఆలయ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి.

ధనస్సు – 28-09-2022

ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం – 28-09-2022

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

కుంభం – 28-09-2022

దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం – 28-09-2022

ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి! (25-09-2022 నుంచి 01-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page