2024-07-27 01:17:50
Today Horoscope : ఆ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి (27-09-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి (27-09-2022)

Today Horoscope : ఆ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి (27-09-2022)

SREE KRUPA (27-09-2022) రాశి ఫలితాలు

మేషం – 27-09-2022

Today Horoscope : కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృషభం – 27-09-2022

దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి.

మిధునం – 27-09-2022

వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి.ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం – 27-09-2022

నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

సింహం – 27-09-2022

స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

కన్య – 27-09-2022

సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల – 27-09-2022

కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం – 27-09-2022

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార,ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

ధనస్సు – 27-09-2022

ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

మకరం – 27-09-2022

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

కుంభం – 27-09-2022

మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

మీనం – 27-09-2022

స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి! (25-09-2022 నుంచి 01-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page