2024-07-27 01:40:42
Today Horoscope : నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం (26-02-2022) – Sirimalli.com

Today Horoscope : నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం (26-02-2022)

Today Horoscope : నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం (26-02-2022)

Today Horoscope  SREE KRUPA (26-02-2022) రాశి ఫలితాలు

మేషం – 26-02-2022

ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయుట మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వృషభం – 26-02-2022

ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిధునం – 26-02-2022

జీవిత భాగస్వామితో సఖ్యత గా వ్యవహరిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం – 26-02-2022

ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

సింహం – 26-02-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కన్య – 26-02-2022

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

తుల – 26-02-2022

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం – 26-02-2022

చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. గృహమునకొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

ధనస్సు – 26-02-2022

చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నం తో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం – 26-02-2022

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.

కుంభం – 26-02-2022

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై గృహమును ప్రస్తావన వస్తుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

మీనం – 26-02-2022

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.


Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page