Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి  (25-02-2022)
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి (25-02-2022)

Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి (25-02-2022)

SREE KRUPA (25-02-2022) రాశి ఫలితాలు

 

మేషం – 25-02-2022

ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు తప్పవు బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం – 25-02-2022

ఇంట బయట విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

మిధునం – 25-02-2022

నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం – 25-02-2022

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతోపరిచయాలు విస్తృతమౌతాయి సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

సింహం – 25-02-2022

కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఊహించని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

కన్య – 25-02-2022

ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలసివస్తాయి, ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

తుల – 25-02-2022

ధనవ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తికొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం – 25-02-2022

కుటుంబంలో శుభాకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అదిగమిస్తారు.

ధనస్సు  – 25-02-2022

కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకా నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మకరం – 25-02-2022

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆధరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆధారణ పెరుగుతుంది.

కుంభం – 25-02-2022

సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్నా నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం – 25-02-2022

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page