2024-07-27 10:48:44
Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు (24-02-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు (24-02-2022)

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు (24-02-2022)

SREE KRUPA (24-02-2022) రాశి ఫలితాలు

మేషం – 24-02-2022

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృషభం – 24-02-2022

జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అవసరానికి చేతికందుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

మిధునం – 24-02-2022

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు సానుకూలమవుతాయి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాల అందుకుంటారు.

కర్కాటకం – 24-02-2022

ముఖ్యమైన పనులు శ్రమాధిక్యత తో గాని పూర్తి కావు.కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

సింహం – 24-02-2022

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి.

కన్య – 24-02-2022

నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సోదరులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు అనుకూల సమయం.

తుల – 24-02-2022

చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన చికాకులు అధికమవుతాయి.

వృశ్చికం – 24-02-2022

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన పదవులు పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.

ధనస్సు – 24-02-2022

ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

మకరం – 24-02-2022

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం – 24-02-2022

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనకొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

మీనం – 24-02-2022

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ధనాదాయ మార్గాలలో లోటు పాట్లుంటాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page