2024-07-27 06:02:30
Today Horoscope : ఆ రాశి వారికి నూతన వస్తు లాభాలు (23-09-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి నూతన వస్తు లాభాలు (23-09-2022)

Today Horoscope : ఆ రాశి వారికి నూతన వస్తు లాభాలు (23-09-2022)

SREE KRUPA (23-09-2022) రాశి ఫలితాలు

మేషం – 23-09-2022

Today Horoscope : కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.

వృషభం  – 23-09-2022

బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

మిధునం – 23-09-2022

ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

కర్కాటకం – 23-09-2022

ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

సింహం – 23-09-2022

వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

కన్య – 23-09-2022

కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల – 23-09-2022

పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం – 23-09-2022

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ధనస్సు – 23-09-2022

ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు.

మకరం – 23-09-2022

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది.

కుంభం – 23-09-2022

వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం – 23-09-2022

ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page