2024-07-27 10:51:05
Today Horoscope : ఆ రాశి వారి జీవితాల్లో ఊహించని మార్పులు ( 23-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారి జీవితాల్లో ఊహించని మార్పులు ( 23-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారి జీవితాల్లో ఊహించని మార్పులు ( 23-03-2022 )

SREE KRUPA (23-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 23-03-2022

Today Horoscope : చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం – 23-03-2022

సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి దైవదర్శనాలు చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

మిధునం – 23-03-2022

దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. గృహమున విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటకం – 23-03-2022

ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

సింహం – 23-03-2022

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి.ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు.

కన్య – 23-03-2022

నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

 తుల – 23-03-2022

వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు.

వృశ్చికం – 23-03-2022

సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు – 23-03-2022

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు.

మకరం – 23-03-2022

నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు.

కుంభం – 23-03-2022

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

మీనం – 23-03-2022

దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

Girish (Purohithulu) sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

Also Read : 

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం 20-03-2022 నుండి 26-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page