2024-07-27 05:13:07
Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు (23-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు (23-04-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు (23-04-2022)

 

SREE KRUPA (23-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 23-04-2022

Today Horoscope : ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

వృషభం – 23-04-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

మిధునం – 23-04-2022

గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం – 23-04-2022

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

సింహం – 23-04-2022

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య – 23-04-2022

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.

తుల – 23-04-2022

మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

వృశ్చికం – 23-04-2022

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు – 23-04-2022

మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మకరం – 23-04-2022

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

కుంభం – 23-04-2022

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం – 23-04-2022

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారమంతా తిరుగులేదు! (17-04-2022 నుంచి 23-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page