Today Horoscope : ఆ రాశి వారికి బంధువుల నుండి శుభవార్తలు (19-09-2022)

Today Horoscope : ఆ రాశి వారికి బంధువుల నుండి శుభవార్తలు (19-09-2022)

 

SREE KRUPA (19-09-2022) రాశి ఫలితాలు

 

మేషం – 19-09-2022

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇతరులతో వివాదలు రాజి చేసుకుంటారు.

వృషభం – 19-09-2022

నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

మిధునం – 19-09-2022

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.

కర్కాటకం – 19-09-2022

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది.

సింహం – 19-09-2022

ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వ్యాపారమున ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య – 19-09-2022

నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

తుల – 19-09-2022

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వృశ్చికం – 19-09-2022

ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మానసిక అశాంతి కలుగుతుంది. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ధనస్సు – 19-09-2022

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

మకరం – 19-09-2022

రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలుచేస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కుంభం – 19-09-2022

ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీనం – 19-09-2022

ఆర్థిక విషయాలు సమస్యత్మకంగా ఉంటాయి. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page