2024-07-27 09:46:48
Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలం – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలం

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలం

SREE KRUPA
రాశి ఫలితాలు (19-02-2022)

మేషం –  19-02-2022

ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన గృహాపకరణాలు కొనుగోలుచేస్తారు.

వృషభం –  19-02-2022

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిధునం –  19-02-2022

ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగామిస్తారు. ఇంటా బయట పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం –  19-02-2022

కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

సింహం –  19-02-2022

బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

కన్య –  19-02-2022

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.భూ సంభందిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల –  19-02-2022

వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చికం –  19-02-2022

సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు –  19-02-2022

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మకరం –  19-02-2022

చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలు సమస్యత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

కుంభం –  19-02-2022

చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంట బయట పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల అంతగా కలసిరావు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం –  19-02-2022

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది.

 

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఈ రాశి వారు కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే..

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-02-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page