2024-07-27 04:56:27
Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రశంసలు (14-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రశంసలు (14-04-2022)

Today Horoscope : ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రశంసలు (14-04-2022)

 

SREE KRUPA (14-04-2022) రాశి ఫలితాలు

 

మేషం  – 14-04-2022

గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం – 14-04-2022

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిధునం – 14-04-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం  – 14-04-2022

నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

సింహం – 14-04-2022

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

కన్య – 14-04-2022

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల – 14-04-2022

చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. స్ధిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం – 14-04-2022

వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు – 14-04-2022

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

మకరం – 14-04-2022

ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

 కుంభం – 14-04-2022

అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసివస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

మీనం – 14-04-2022

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారి నిరుద్యోగులు, వ్యాపారస్తులకు అద్భుతమైన అవకాశాలు (10-04-2022 నుంచి 16-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page