Today Horoscope : ఆ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి! (13-12-2022)

Today Horoscope : ఆ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి! (13-12-2022)

 

SREE KRUPA (13-12-2022) రాశి ఫలితాలు

మేషం – 13 -12-2022

Today Horoscope : వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

 

వృషభం – 13 -12-2022

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

 

 

మిధునం – 13 -12-2022

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 

 

కర్కాటకం – 13 -12-2022

నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

 

 

సింహం – 13 -12-2022

నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

 

కన్య – 13 -12-2022

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

 

 

తుల – 13 -12-2022

వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

 

 

వృశ్చికం – 13 -12-2022

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

 

 

ధనస్సు – 13 -12-2022

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు.

 

 

మకరం – 13 -12-2022

వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

 

 

కుంభం – 13 -12-2022

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

 

 

మీనం – 13 -12-2022

బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page