2024-07-27 10:54:24
Today Horoscope : ఆ రాశి వారికి కీలక నిర్ణయాలతో లాభాలు ! (09-11-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి కీలక నిర్ణయాలతో లాభాలు ! (09-11-2022)

Today Horoscope : ఆ రాశి వారికి కీలక నిర్ణయాలతో లాభాలు ! (09-11-2022)

 

SREE KRUPA (09-11-2022) రాశి ఫలితాలు

 

మేషం – 09-11-2022

Today Horoscope : వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ
మార్గాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

వృషభం – 09-11-2022

వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు
తొలగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను
ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

మిధునం – 09-11-2022

ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు
మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది శ్రమాదిక్యాతతో దూర
ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.

కర్కాటకం – 09-11-2022

విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు
తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయట పడగలరు.

సింహం – 09-11-2022

బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల
నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.

కన్య – 09-11-2022

స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు
తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో
సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

తుల – 09-11-2022

జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి.
నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు. బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం – 09-11-2022

వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుండి శుభకార్య
ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా
సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు – 09-11-2022

చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా
సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో విందు వినోద
కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మకరం – 09-11-2022

వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి.దైవ సేవ
కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి.

కుంభం – 09-11-2022

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు. గృహమున ఆధ్యాత్మిక సేవ
కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు ధన సహాయం అందిస్తారు.

మీనం – 09-11-2022

క్రయవిక్రయాలలో లాభలు అందుకుంటారు. వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త
అవసరం. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.విలువైన
వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page