2024-07-27 05:56:58
Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా పురోగతి! (10-11-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా పురోగతి! (10-11-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థికంగా పురోగతి! (10-11-2022)

SREE KRUPA (10-11-2022) రాశి ఫలితాలు

 

మేషం – 10-11-2022

Today Horoscope : నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. వ్యాపారంలో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.

వృషభం – 10-11-2022

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిధునం – 10-11-2022

క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం – 10-11-2022

వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహం – 10-11-2022

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

కన్య – 10-11-2022

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల – 10-11-2022

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమౌతాయి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.

వృశ్చికం – 10-11-2022

ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు – 10-11-2022

గృహమున విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మకరం – 10-11-2022

వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం – 10-11-2022

ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి. గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలుంటాయి.

మీనం – 10-11-2022

ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page