Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ( 06-04-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ( 06-04-2022 )

SREE KRUPA (06-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 06-04-2022

Today Horoscope : కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృషభం – 06-04-2022

పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం – 06-04-2022

ఆర్థిక ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. వాహనాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడుల పెట్టడం మంచిది.

కర్కాటకం – 06-04-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘ కాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.

సింహం – 06-04-2022

గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. బంధువులతో వివాదాలు తొలగుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

కన్య – 06-04-2022

చిన్ననాటి మిత్రులతో ఏర్చడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు ఉత్సాహనిస్తాయి. భూ క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు. అందుకుంటారు.

తుల – 06-04-2022

గృహ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

వృశ్చికం – 06-04-2022

నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనస్సు – 06-04-2022

మిత్రుల నుండి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం – 06-04-2022

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం – 06-04-2022

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘ కాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

మీనం – 06-04-2022

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

Girish Panthulu sirimalli.com
Girish Panthulu sirimalli.com

 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

For More Updates Follow us on – Sirimalli Page