Today Horoscope : ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం ( 05-04-2022 )
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం ( 05-04-2022 )

Today Horoscope : ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం ( 05-04-2022 )

 

SREE KRUPA (05-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 05-04-2022

Today Horoscope : చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలున్నవి.

వృషభం – 05-04-2022

దూరప్రయాణాలలో మార్గ అవరోదాలు కలుగుతాయి ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

మిధునం – 05-04-2022

చేపట్టిన వ్యవహారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం – 05-04-2022

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం – 05-04-2022

కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తప్పవు.బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి.

కన్య – 05-04-2022

దూర ప్రయాణ సూచనలున్నవి.స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా ఫలించవు ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

తుల – 05-04-2022

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం – 05-04-2022

సమాజంలో ప్రముఖుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు.మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

ధనస్సు – 05-04-2022

ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

మకరం – 05-04-2022

ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం – 05-04-2022

సన్నిహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగవకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున సమస్యలు అదిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.

మీనం – 05-04-2022

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది

Girish Panthulu sirimalli.com
Girish Panthulu sirimalli.com

 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

For More Updates Follow us on – Sirimalli Page