Today Horoscope: ఈ రాశి వారికి నూతన వాహన యోగం.. వివిధ రాశుల ఫలితాలు

Today Horoscope: ఈ రాశి వారికి నూతన వాహన యోగం.. వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు

SREE KRUPA (05-09-2021) రాశి ఫలితాలు 

మేషం – 05-09-2021

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఉంటాయి.

వృషభం – 05-09-2021

నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మిధునం – 05-09-2021

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు.

కర్కాటకం – 05-09-2021

చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

సింహం – 05-09-2021

వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య – 05-09-2021

దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు.

తుల – 05-09-2021

ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం – 05-09-2021

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

ధనస్సు – 05-09-2021

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం – 05-09-2021

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకుంటారు ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం – 05-09-2021

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం – 05-09-2021

చేపట్టిన పనులుపనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)