Today Horoscope : ఆ రాశి వారికి విలువైన వస్తులాభాలు (05-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి విలువైన వస్తులాభాలు (05-10-2022)

 

SREE KRUPA (05-10-2022) రాశి ఫలితాలు

 

మేషం – 05-10-2022

Today Horoscope : కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

వృషభం – 05-10-2022

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

మిధునం – 05-10-2022

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం – 05-10-2022

ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి.

సింహం – 05-10-2022

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు.

కన్య – 05-10-2022

బందు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల – 05-10-2022

బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి.

వృశ్చికం – 05-10-2022

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.

ధనస్సు – 05-10-2022

వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మకరం – 05-10-2022

ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.

కుంభం – 05-10-2022

సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

మీనం – 05-10-2022

సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆర్థికంగా మరింత లాభాలు (02-10-2022 నుంచి 08-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page