2024-07-27 10:58:53
Today Horoscope : ఆ రాశి వారికి విలువైన వస్తులాభాలు (03-10-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి విలువైన వస్తులాభాలు (03-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి విలువైన వస్తులాభాలు (03-10-2022)

 

SREE KRUPA (03-10-2022) రాశి ఫలితాలు

 

మేషం – 03-10-2022

Today Horoscope : గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధువులతో విభేదాలు తప్పవు. గృహమున కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి.

వృషభం – 03-10-2022

కొన్ని ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.

మిధునం – 03-10-2022

మిత్రులతో వివాదాల నుండి బయటపడతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి.

కర్కాటకం – 03-10-2022

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

సింహం – 03-10-2022

వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కన్య – 03-10-2022

ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగతాయి. బంధు మిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

తుల – 03-10-2022

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం – 03-10-2022

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు కలుగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు – 03-10-2022

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు క్రమక్రమంగా ఇబ్బందులు తొలగుతాయి.

మకరం – 03-10-2022

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది కుటుంబసభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం – 03-10-2022

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం – 03-10-2022

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆప్తుల సలహాలు కొన్ని విషయాలలో కలసి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆర్థికంగా మరింత లాభాలు (02-10-2022 నుంచి 08-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page