2024-07-27 05:18:36
Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు (02-05-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు (02-05-2022)

Today Horoscope : ఆ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు (02-05-2022)

SREE KRUPA (02-05-2022) రాశి ఫలితాలు

 

మేషం – 02-05-2022

Today Horoscope : చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

వృషభం – 02-05-2022

గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వృత్తిఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి.

మిధునం – 02-05-2022

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.

కర్కాటకం – 02-05-2022

బంధు మిత్రుల నుండి శుభ వర్తమానలు అందుతాయి ఆర్థికవాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం – 02-05-2022

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య – 02-05-2022

చేపట్టిన పనులులో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల – 02-05-2022

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి వృత్తిఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం – 02-05-2022

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ధన పరంగా లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు – 02-05-2022

ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

మకరం – 02-05-2022

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం – 02-05-2022

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగమునతొందరపాటు నిర్ణయాలు చేస్తారు.

మీనం – 02-05-2022

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగ ఉంటుంది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఈ వారం ఈ రాశుల వారికి తిరుగులేదు (01-05-2022 నుంచి 07-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page