Today Horoscope : ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి (01-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి (01-10-2022)

SREE KRUPA (01-10-2022) రాశి ఫలితాలు

మేషం – 01-10-2022

Today Horoscope : స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

వృషభం – 01-10-2022

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన రుణాలు చేస్తారు.

మిధునం – 01-10-2022

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు.

కర్కాటకం – 01-10-2022

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి.

సింహం – 01-10-2022

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి.

కన్య – 01-10-2022

వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కలుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

తుల – 01-10-2022

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఉద్యోగాలలో ఆశించినస్థానచలనాలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

వృశ్చికం – 01-10-2022

వాహన అనుకూలత కలుగుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరమవుతాయి.

ధనస్సు – 01-10-2022

దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి.

మకరం – 01-10-2022

వ్యాపారాలు విస్తరిస్తారు చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశములు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కుంభం – 01-10-2022

దీర్ఘకాలిక రుణ వత్తిడి పెరుగుతుంది ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.

మీనం – 01-10-2022

సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి! (25-09-2022 నుంచి 01-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page