2024-07-27 05:59:51
Shivani Rajashekar: హీరోయిన్ నుండి మోడల్‌గా స్టార్ కూతురు.. కాస్త వెరైటీ.. – Sirimalli.com

Shivani Rajashekar: హీరోయిన్ నుండి మోడల్‌గా స్టార్ కూతురు.. కాస్త వెరైటీ..

Shivani Rajashekar: సినీ పరిశ్రమలో ఎంతోమంది సీనియర్ నటీనటుల వారసులు తమ సత్తా చాటుకోవడానికి అడుగుపెడుతుంటారు. అలా నటీనటులుగా, దర్శకులుగా సెటిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకొక ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలనుకునేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి చేరింది రాజశేఖర్, జీవితల కుమార్తె.

ఫ్యామిలీ హీరోగా రాజశేఖర్ ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన చేసిన సినిమాలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా యంగ్ హీరోల పోటీని తట్టుకోలేక రాజశేఖర్ కాస్త స్లో అయ్యారు. అదే సమయంలో ఆయన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా పరిచయం చేశారు. వారే శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్. ఇక వీరిద్దరు హీరోయిన్లుగా నటించడంతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా పలు విభాగాలలో తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముందుగా ఇండస్ట్రీలోకి రాజశేఖర్ చిన్న కూతురు శివ్మాతిక అడుగుపెట్టింది. హీరోయిన్‌గా ఒకట్రెండు సినిమాలు చేయగానే ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. ఇక పెద్ద కూతురు శివానీ చేసిన ప్రతీ సినిమా హిట్ అనిపించుకుంటూ ముందుకెళ్తోంది. ముందుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక కంటే శివానీనే ఎక్కువగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇదే సమయంలో శివానీ తన కెరీర్‌లో ఓ కొత్త మలుపు తీసుకోనుంది.

Also Read: https://www.sirimalli.com/parineeti-chopra-rejects-animal-movie-because-of-this-reason/

చాలావరకు అమ్మాయిలు ముందుగా మోడల్స్‌గా తమ టాలెంట్‌ను నిరూపించుకున్న తర్వాతే దాని ద్వారానే సినిమాల్లోకి అడుగుపెడుతుంటారు. కానీ శివానీ మాత్రం రివర్స్‌లో వెళ్లనుంది. హీరోయిన్‌గా నిరూపించుకున్న తర్వాత శివానీ మిస్ ఇండియా పోటీలకు సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న మిస్ ఇండియా పోటీల ఆడిషన్స్‌లో పాల్గొంటున్నానని శివానీనే స్వయంగా తన సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో హీరోయిన్ నుండి మోడల్‌గా మారుతున్న శివానీకి నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Shivani Rajashekar Instagram Post: https://www.instagram.com/p/CcekJBIqgTQ/