2024-07-27 01:28:11
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి . – Sirimalli.com

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి .

Revanth reddy : కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహ్మద్ అజారుద్దన్, ఎం.అంజన్ కుమార్ యాదవ్, జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్ కుమార్ గౌడ్ లను నియమించింది. ఉపాధ్యక్షులుగా దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, పొడెం వీరయ్య, రవి మల్లు, వేం నరేందర్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్‌, గోపిశెట్టి నిరంజన్‌, రమేశ్‌ ముదిరాజ్‌, జావేద్‌ ఆమీర్‌, టి.కుమార్‌ రావులను నియమించింది. వీటితోపాటు మరికొన్ని పదవులను కూడా భర్తీ చేసింది. కన్వీనర్ గా సయ్యద్ అజమ్ తుల్లా హుస్సేనీ, ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీ గౌడ్ ని ప్రకటించింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా ఆలేటి మహేశ్వరరెడ్డిని, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా దామోదర్ సి.రాజనర్సింహను అప్పాయింట్ చేసింది. సీనియర్ నాయకుల్లో చాలామంది ఆశావహులకు ఈ లిస్టులో చోటు దక్కలేదు.

ఇవి కూడా చదవండి : 

Also Read: Mansas Trust : మాన్సాస్ ట్రస్ట్ జీవోలను కొట్టివేసిన హైకోర్టు

Also Read: కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆయన పేరు ఖరారు?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage