2024-07-27 04:59:00
Rajamouli: అల్లు అర్జున్‌తో రాజమౌళి.. మరి మహేష్ పరిస్థితి ఏంటి..? – Sirimalli.com

Rajamouli: అల్లు అర్జున్‌తో రాజమౌళి.. మరి మహేష్ పరిస్థితి ఏంటి..?

Rajamouli: సినీ పరిశ్రమలో కొందరు దర్శకులతో పనిచేయాలని నటీనటులకు.. కొందరు నటీనటులను డైరెక్ట్ చేయాలని దర్శకులకు కోరిక ఉంటుంది. అయితే అలాంటి కేటగిరిలో కూడా ఎక్కువశాతం స్టార్ హీరోలు ఓటు వేసే డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). అయితే ఇన్నాళ్లకు ఈ దర్శక ధీరుడికి, సూపర్ స్టార్‌కు కాంబినేషన్ సెట్ అయ్యింది. కానీ ఇంతలోనే ఆ కాంబినేషన్‌పై అనుమానాలు మొదలయ్యాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇదివరకు ఏ సినిమాకు అయినా.. ఏడాదికంటే ఎక్కువ సమయం తీసుకునేవాడు. కచ్చితంగా ప్రతీ సంవత్సరం తన నుండి ఏదో ఒక సినిమా అభిమానులను అలరించడానికి వచ్చేది. కానీ కరోనా వల్ల అందరిలాగానే మహేశ్ సినిమాలకు కూడా చాలా గ్యాప్ వచ్చింది. తన తరువాతి సినిమా ‘సర్కారు వారి పాట’ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో తన తరువాతి సినిమా రాజమౌళితో అని అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Also Read: https://www.sirimalli.com/panchangam-today-16-march-2022-in-telugu/

రాజమౌళి ఇతర టాలీవుడ్ దర్శకులలాగా కాదు.. తాను కథ విషయంలో, ప్రీ ప్రొడక్షన్ విషయంలో ఎక్కువగా సమయం తీసుకోకపోయినా.. షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం చాలా సమయం పడుతుంది. ఒక్కొక్క సినిమాకు మినిమమ్ రెండేళ్లు సమయం తీసుకునే రాజమౌళితో మహేశ్ సినిమా అనగానే తన అభిమానులంతా ఆశ్చర్యపోయారు. రాజమౌళిలాంటి దర్శకుడికి మహేశ్‌లాంటి హీరో రెండేళ్లు కాల్ షీట్స్ ఇవ్వగలడా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఓ నేషనల్ మీడియా సంస్థ రాజమౌళి తరువాతి చిత్రం అల్లు అర్జున్‌తో అంటూ.. ప్రచారం మొదలుపెట్టింది. ‘పుష్ప’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న అల్లు అర్జున్.. ‘ఆర్ఆర్ఆర్’తో ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకుంటున్న రాజమౌళి కలిసి ఓ మూవీ తీస్తే బాగానే ఉంటుంది కానీ.. మధ్యలో మహేశ్‌తో చేయాల్సిన సినిమా పరిస్థితి ఏంటి? అసలు ఈ వార్త నిజమా? ఫేకా? అని ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. దీనికి సమాధానం కావాలంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.