2024-05-29 05:54:05
టాలీవుడ్ రౌడీకి నాకు మధ్య అలాంటిదేం లేదు.. బన్నీతో మాత్రం.. – Sirimalli.com

టాలీవుడ్ రౌడీకి నాకు మధ్య అలాంటిదేం లేదు.. బన్నీతో మాత్రం..

Rashmika relations : : విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ ఏంటి?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. యూత్ లో యమా క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు. వీళ్లిద్దరూ కలిసి నటించిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ లోనూ వీళ్ల కెమిస్ట్రీ మామూలుగా లేదు. సినిమా యావరేజిగా ఆడినా… రష్మిక, విజయ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

 Rashmika Mandanna :
Rashmika Mandanna :

విజయ్ దేవరకొండ పక్కన కనిపించినంత అందంగా రష్మిక మరే ఇతర హీరో పక్కనా కనిపించదు అనేంతగా ఆన్ స్క్రీన్ మీద వాళ్ల జోడీ అద్భుతంగా ఉంటుంది. రీల్ లైఫ్ లో సరే… రియల్ లైఫ్ లో రష్మిక, విజయ్ ఎలా ఉంటారు? ఈ ప్రశ్నకు రష్మికే స్వయంగా సమాధానం చెప్పింది.

Rashmika mandanna & Vijya devarakonda
Rashmika mandanna & Vijya devarakonda

రష్మిక-విజయ్ రిలేషన్  (Rashmika relations ) లో ఉన్నారనే రూమర్స్ కూడా ఉన్నా… అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేసింది…. రష్మిక. ఇన్ స్టాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఈ భామ… విజయ్ తో తనకున్నది కేవలం ఫ్రెండ్ షిప్ అని మాత్రమే చెప్పింది.

Rashmika mandanna & Vijya devarakonda
Rashmika mandanna & Vijya devarakonda

విజయ్‌ దేవరకొండ మీకు ఎంత స్పెషల్ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు…. అతనంటే తనకు చాలా ఇష్టమన్న రష్మిక… విజయే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. కొచ్చిలో డియర్ కామ్రేడ్ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమంటూ.. దాన్ని షేర్ కూడా చేసింది.

Rashmika mandanna & Vijya devarakonda
Rashmika mandanna & Vijya devarakonda

ఇక అల్లు అర్జున్ తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంటుందో కూడా చెప్పిందీ ముద్దుగుమ్మ. పుష్పలో అల్లు అర్జున్ తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని… కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉంటారనీ చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ మొదలవగానే క్యారెక్టర్లో లీనమైపోయి ప్రొఫెషనల్ గా మారిపోతారని… మంచి నటుడు, అద్భుతమైన డాన్సర్ అని అల్లు అర్జున్ కు కితాబిచ్చింది… రష్మిక.

ఇవి కూడా చదవండి : 

Also Read : Keerthy Suresh : అబ్బా కీర్తి.. నీ అందమైన రహస్యం ఏమిటో తెలిసిపోయిందోచ్!

Also Read : Lavanya Tripathi :నిలువెత్తు అందం… ఈ అందాల రాక్షసి లావణ్య సొంతం ….

Also Read : Nivetha Thomas : ఎర్ర చీర, ఎరుపు బొట్టు, మంచి కాఫీ.. నివేదా ఏంటి మేటర్?

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage