2024-07-27 05:24:54
Samantha : సమంత, నాగచైతన్య మధ్యలో శ్రీరెడ్డి..! – Sirimalli.com

Samantha : సమంత, నాగచైతన్య మధ్యలో శ్రీరెడ్డి..!

Samantha : టాలీవుడ్ లో ఇప్పుడేమైనా హాట్ టాపిక్ ఉందంటే అది అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల న్యూస్.. ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గతకోద్దిరోజులుగా న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తల పైన అటు నాగచైతన్య కానీ ఇటు సమంత(Samantha) కానీ స్పందిచలేదు. దీంతో ఈ వార్తలకి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

కానీ తాజాగా లవ్ స్టొరీ మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య ట్వీట్ ని సామ్ రీట్వీట్ చేయడం, దానికి చైతూ థాంక్స్ చెప్పడంతో అభిమానులు ఈ వార్తలు జస్ట్ పుకార్లేనని అనుకుంటున్నారు. అయితే ఈ ఇష్యూ లోకి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంటర్ అయింది.

Image

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంటపై తప్పుడు వార్తలను క్రియేట్ చేయవద్దని, వారి బ్రేకప్ గురించి పుకార్లు చేయవద్దని సపోర్ట్ గా నిలిచింది. అంతేకాకుండా సమంత, చైతన్యల జంటను స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అంటూ పోగిడేసింది.

https://twitter.com/MsSriReddy/status/1437646480655802370

క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి.. ఇప్పటికీ పలువురు నటీనటుల పైన కీలక వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా సమంత, చైతన్యల ఇష్యూ పైన సపోర్టింగ్ గా నిలవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Image

ఇక లవ్ స్టొరీ సినిమా విషయానికి వచ్చేసరికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read :