2024-07-27 05:58:31
Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (30-05-2021 నుంచి 05-06-2021 వరకు) – Sirimalli.com

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (30-05-2021 నుంచి 05-06-2021 వరకు)

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (30-05-2021 నుంచి 05-06-2021 వరకు) కింది విధంగా ఉన్నాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు వారఫలాలు (Weekly Horoscope) అన్నీ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది.

SREE KRUPA (Weekly Horoscope)

మేషం (Aries) :

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టినవ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా వ్యవహరించి బయట పడతారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహనిర్మాణ ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాల బాట పడతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు కలసి వస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణ ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

వృషభం (Taurus) :

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోవడం మంచిది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్ధిరాస్తి వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఊరట కలుగుతుంది. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగిన సకాలంలో పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ప్రయూణలు వాయిదా పడతాయి. ఋణప్రయత్నాలు అంతగా ఫలించవు సూర్య కవచం పారాయణం చెయ్యడం వలనa శుభ ఫలితాలను పొందుతారు.

మిధునం (Gemini) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ధన పరంగా ఇబ్బందులు ఉన్నపటికీ దైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల సలహాలు తీసుకోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు పాతవిషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. ఋణ ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు . ఉద్యోగాలలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే జారిపోతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో కొన్ని విషయాలలో కలహాలు కలుగుతాయి గణపతి ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం (Cancer) :

చేపట్టినపనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఇంట బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేతిలో డబ్బు నిల్వ లేకున్నా అవసరానికి ధన సహాయం అందుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాలను గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా ఉన్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. వారం చివరన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక పోవడం మంచిది. దేవి ఖడ్గమాలా స్తోత్రం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం (Leo) :

చేపట్టిన పనులలో అవరోధాలున్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల కలయిక ఆనందం కలిగిస్తుంది మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖల పరిచయాలు విస్తృతమౌతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంతాన వివాహా విషయమై చర్చలు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉత్సహకర వాతావరణంఉంటుంది. వృత్తివ్యాపారాలలోసమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాల అందుతాయి. వారాంతమున ఋణ ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య (Virgo) :

దీర్ఘకాలంగా సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.చేపట్టిన పనులలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహకారంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వివాహాది శుభకార్యాలు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో బంధు మిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సుబ్రమణ్య స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల (Libra) :

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనలను అమలు పరచడం మంచిది. సంఘంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి వర్గం నుండి స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.ఉద్యోగమున శత్రు పరమైన సమస్యల నుండి బయట పడతారు. దీర్ఘ కాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గురుచరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చికం (Scorpio) :

వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. ఒక వ్యవహారంలో బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. విద్యార్థులకు అందిన అవకాశములు చేజారకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగ కొంత అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరన సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. విష్ణు ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు (Sagitarus) :

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు ఆత్మవిశ్వాసంతో రాజీ చేస్తారు. కుటుంబ విషయంలో సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో బంధు మిత్రులతో పాల్గొంటారు.ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు పడతారు. ఇంట బయట స్వల్ప వివాదాలు ఉంటాయి. రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మకరం (Capricorn) :

సమాజంలో కీర్తి,ప్రతిష్టలు పెరుగుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో చికాకులు తొలగి ఉపశమనం కలుగుతుంది గృహనిర్మాణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. గృహమునశుభ కార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. కలిసివస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులుంటాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం (Aquarius) :

చిన్ననాటి మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బకాయిలు వసూలవుతాయి. పాత ఋణాలు కొన్ని తీర్చగలుగుతారు. కుటుంబ విషయంలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.నిరుద్యోగుల ఇప్పటివరకు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు అందుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వారాంతమున స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిఆరాధనచెయ్యడం వలన శుభఫలితాలను పొందుతారు.

మీనం (Pisces) :

దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు సర్దుమణిగి లాభాలు పొందుతారు. భూ క్రయ విక్రయాల విషయంలో స్వంత ఆలోచనలు చేయడం మంచిది. విద్యార్థుల కష్టానికి ఫలితం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఆదరణ పెరుగుతుంది. వారం చివరలో ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

Weekly Horoscope

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Panchangam : 30-05-2021 ఆదివారం.. నేటి పంచాంగం

Also Read : Today Horoscope : 30-05-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage