2024-07-27 05:26:08
Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (27-06-2021 నుంచి 03-07-2021 వరకు) – Sirimalli.com

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (27-06-2021 నుంచి 03-07-2021 వరకు)

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (27-06-2021 నుంచి 03-07-2021 వరకు) కింది విధంగా ఉన్నాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు వారఫలాలు (Weekly Horoscope) అన్నీ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది.

SREE KRUPA (Weekly Horoscope)

మేషం (Aries) :

ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా
సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి
ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి . వారం చివరన స్వల్ప ధన
వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.లక్ష్మి దేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం (Taurus) :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు . స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి . ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు.

మిధునం (Gemini) :

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు.కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు . వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం (Cancer) :

చేపట్టిన పనులు లో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు
చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా
గందరగోళ పరిస్థితులు ఉంటాయి సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ
నిర్మాణ ప్రయత్నాలు లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం
లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం
ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది దూరప్రయాణాలుజాగ్రత్త వహించడం
మంచిది.విష్ణుసహస్రనామ పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

సింహం (Leo) :

వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన _ కొనుగోలుప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు
లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి
కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివరన వృధా ఖర్చులు
ఉంటాయి ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దుర్గా దేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య (Virgo) :

చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి
వస్తాయి . ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి . స్థిరాస్తి వివాదాలు తెలివిగా
పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన
వారితో పరిచయాలు కలుగుతాయి.మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధార్మిక సేవ
కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగా అవకాశాలు దక్కుతాయి.
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం
ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి . ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది . నవగ్రహ ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల (Libra) :

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగాఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు . అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు . చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదురులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు , కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి . ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి
లభించదు . కొన్ని రంగాలవారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది . వారం చివరిలో
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు . ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దేవి ఖడ్గ మాల స్తోత్రం
పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలుపొందుతారు.

వృశ్చికం (Scorpio) :

చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు.చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు.

ధనస్సు (Sagitarus) :

రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి
సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు
అందుకోవడం కష్టంగా మారుతుంది.ఉద్యోగమున పని జఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు
ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని. సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభసూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది ఆంజనేయస్వామి ఆరాధన చేయడం.

మకరం (Capricorn) :

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు
కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల
సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి . వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు అన్ని రంగాల వారికి దీర్సకాలిక బుణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధన పరంగాఇబ్బందులు ఉంటాయి.ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం (Aquarius) :

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు . ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి . ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు . తల్లి తండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత
కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత
చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు. చేస్తారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీనం (Pisces) :

చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక
వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి . కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి.
నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులనుండి శుభకార్య
ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూవివాదాలు ఒక కొలిక్కి వస్తాయి . గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు .వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి . నరసింహ స్వామి ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలుపొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

Weekly Horoscope

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Horoscope : 27-06-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు..

Also Read : Today Panchangam : 27-06-2021 ఆదివారం … నేటి పంచాంగం..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage