2024-07-27 05:26:52
Today Horoscope : 31-07-2021 శనివారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 31-07-2021 శనివారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 31-07-2021 శనివారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (31-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వృషభ రాశి (Taurus) :

కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు దూర ప్రయాణా సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది.

మిధున రాశి (Gemini) :

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది . ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చాలాకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి (Cancer) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది . ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కన్య రాశి (Virgo) :

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిఅవుతాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంట బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకో వడం మంచిది విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio) :

దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు.

ధనస్సు రాశి (Sagitarus) :

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకర రాశి (Capricorn) :

స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి (Aquarius) :

కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు.

మీన రాశి (Pisces) :

దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి .కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లక పోవడానికి మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 31-07-2021 శనివారం … నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage