2024-07-27 10:56:46
Today Horoscope : 29-05-2021 శనివారం నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 29-05-2021 శనివారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 29-05-2021 శనివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA (29-05-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

ఖర్చుకు తగిన అదాయం ఉండదు. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృషభం (Taurus) :

స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకోలేరు. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.

మిధునం (Gemini) :

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో తగిన గుర్తింపు లబిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

కర్కాటకం (Cancer) :

ఇంట బయట బాధ్యతలు సమర్ధవంతగా నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహనవ్యాపారస్తులు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం (Leo) :

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసర విషయాలపై ధనవ్యయం చేస్తారు. బంధు మిత్రులతో ఆకస్మిక కలహాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కన్య (Virgo) :

ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తుల (Libra) :

సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో సంప్రదింపులు కలసివస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి.

వృశ్చికం (Scorpio) :

కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ప్రయాణాలు వలన శారీరకశ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఇతరుల ప్రవర్తన నిరుత్సాహం కలిగిస్తుంది.స్వల్ప ఆరోగ్య ఇబ్బందులుంటాయి.

ధనస్సు (Sagitarus) :

కుటుంబములో కొంత మంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి.చిన్న నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్దవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

మకరం (Capricorn) :

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో అకారణ కలహాలుకలుగుతాయి. వ్యాపారాలలో కష్టపడ్డాఫలితం ఉండదు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చేసుకుంటాయి.

కుంభం (Aquarius) :

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు గూర్చి చర్చిస్తారు. అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆకస్మికంగా ధన లబ్ది కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సహకాలు లభిస్తాయి.

మీనం (Pisces) :

నిరుద్యోగులకు నూతన అవకాశలు అందుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 29-05-2021 శనివారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage