Today Horoscope : 28-06-2021 సోమవారం .. నేటి రాశిఫలాలు..

Today Horoscope : 28-06-2021 సోమవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (28-06-2021) రాశి ఫలితాలుమేషం

మేష రాశి (Aries) :

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

వృషభ రాశి (Taurus) :

కుటుంబసభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది

మిధున రాశి (Gemini) :

రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది

కర్కాటక రాశి (Cancer) :

ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి

సింహ రాశి (Leo) :

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగాఉంటాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు

కన్య రాశి (Virgo) :

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తుల రాశి (Libra) :

ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది

వృశ్చిక రాశి (Scorpio) :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది

ధనస్సు రాశి (Sagitarus) :

జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్యవిషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు

మకర రాశి (Capricorn) :

ఆదాయ మార్గాలు పెరుగుతాయి.సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి

కుంభ రాశి (Aquarius) :

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది

మీన రాశి (Pisces) :
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు . ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు . నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు .సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 28-06-2021 సోమవారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage