2024-07-27 09:31:46
Today Horoscope : 27-07-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 27-07-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 27-07-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (27-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభ వార్తలు అందుకుంటారు.

వృషభ రాశి (Taurus) :

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణా సూచనలున్నవి. ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన విశ్రాంతి ఉండదు.

మిధున రాశి (Gemini) :

చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు .మిత్రులతో వివాదాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ఉండవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటక రాశి (Cancer) :

సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

సింహ రాశి (Leo) :

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత పురోగతి సాధిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలు అందుతాయి దూరపు బంధువుల విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య రాశి (Virgo) :

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. బంధువర్గం మీ మాటతో విభేధిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు చేయవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశకలిగిస్తాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి పాత ఋణాలుతీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో పని భారం అధికమవుతుంది వ్యాపారపరంగా నూతన సమస్యలు కలుగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి (Sagitarus) :

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు సన్నిహితులతో కొన్ని విషయాల్లో చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో కొంత అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారపరంగా పెట్టుబడులు ఆలస్యం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.

మకర రాశి (Capricorn) :

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది.

కుంభ రాశి (Aquarius) :

చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు లభించక నిరాశ కలుగుతుంది.

మీన రాశి (Pisces) :

చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభదాయకంగా సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (25-07-2021 నుంచి 31-07-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read :Today Panchangam : 27-07-2021 మంగళవారం … నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

Https://Www.Facebook.Com/SirimalliPage