2024-07-27 05:51:14
Today Horoscope : 28-07-2021 బుధవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 28-07-2021 బుధవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 28-07-2021 బుధవారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (28-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల ఆగమనం ఆనందం కలిగీస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

వృషభ రాశి (Taurus) :

కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

మిధున రాశి (Gemini) :

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి (Cancer) :

గృహమున శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులకు కొంత అనుకూలత కలుగుతుంది. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్య రాశి (Virgo) :

కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టినపనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన విషయాలలో శుభ వర్తమానలు అందుకుంటారు.

వృశ్చిక రాశి (Scorpio) :

గృహమున సందడి వాతావరణం ఉంటుది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి (Sagitarus) :

దూర ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ఆశించిన సహాయం పొందుతారు.

మకర రాశి (Capricorn) :

కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు తొలగుతాయి.వృత్తి, వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
దైవ దర్శనాలు చేసుకుంటారు.

కుంభ రాశి (Aquarius) :

ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది.వృత్తి ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. నూతన వాహనయోగం ఉన్నది.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగి ఆర్ధిక లబ్ధ్ది పొందుతారు. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు పెద్దల సహాయంతో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (25-07-2021 నుంచి 31-07-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 28-07-2021 బుధవారం… నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

Https://Www.Facebook.Com/SirimalliPage