2024-07-27 05:01:08
Today Horoscope : 26-07-2021 సోమవారం… నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 26-07-2021 సోమవారం… నేటి రాశిఫలాలు..

Today Horoscope : 26-07-2021 సోమవారం.. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (26-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది.

వృషభ రాశి (Taurus) :

ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణం సూచనలున్నవి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది.

మిధున రాశి (Gemini) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు విఫలమౌతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

కర్కాటక రాశి (Cancer) :

వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసి వస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

సింహ రాశి (Leo) :

నూతన వ్యక్తుల పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహవాతావరణం ఉంటుంది.

కన్య రాశి (Virgo) :

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

మిత్రుల వలన సమస్యలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండక ఇబ్బందులు పెరుగుతాయి. ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు అధికమౌతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio) :

దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి (Sagitarus) :

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకర రాశి (Capricorn) :

స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి దైవసేవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభ రాశి (Aquarius) :

అవసరం కానీ వస్తువులకు ధన వ్యయం చేస్తారు ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

మీన రాశి (Pisces) :

కుటుంబ సభ్యుల తో వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలలో కొత్తవ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ పరంగా ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (25-07-2021 నుంచి 31-07-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 26-07-2021 సోమవారం … నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

Https://Www.Facebook.Com/SirimalliPage