Bhakthi

Today Horoscope : 25-05-2021 మంగళవారం నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-25-05-2021

Today Horoscope : 25-05-2021 మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి

SREE KRUPA 25-05-2021) రాశి ఫలితాలు

మేషం (Aries) :

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తిఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది.

వృషభం (Taurus) :

అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.సేవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మిధునం (Gemini) :

ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం (Cancer) :

నూతనఋణప్రయత్నాలు చేస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.

సింహం (Leo) :

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండిశుభకార్య ఆహ్వానాలు అందుతాయి.దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య (Virgo) :

చేపట్టి కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

తుల (Libra) :

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

ధనస్సు (Sagitarus) :

ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం (Capricorn) :

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది సమాజంలో పెద్దలతో సఖ్యత గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం (Aquarius) :

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి.

మీనం (Pisces) :

వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Panchangam : 25-05-2021 మంగళవారం .. నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage