Today Horoscope : 23-06-2021 బుధవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 23-06-2021 బుధవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

REE KRUPA (23-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. గృహమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కొన్ని రంగాల వారికి నిరాశ తప్పదు

వృషభ రాశి (Taurus) :

సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.దీర్ఘకాలిక ఋణ సమస్యలు తొలగి ఉపశమనం పొందుతారు

మిధున రాశి (Gemini) :

ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి కొన్ని వ్యవహారాలలో నూతన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అంచనాలు నిజమవుతాయి.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి

కర్కాటక రాశి (Cancer) :

పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు చేసిన నష్టపడతారు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.

సింహ రాశి (Leo) :

నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.కుటుంబ సభ్యులు కొన్ని వినకూడని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

కన్య రాశి (Virgo) :

సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు . శత్రు సమస్యలనుండి తెలివిగా బయట పడతారు వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.నిరుద్యోగులకు ఊహించని అవకాశములు అందుతాయి

తుల రాశి (Libra) :

ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి లభించదు. ఆర్థికంగా కొంత మిశ్రమ ఫలితాలుంటాయి

వృశ్చిక రాశి (Scorpio) :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు

ధనస్సు రాశి (Sagitarus) :

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటాబయటా బాధ్యతలు మరింత బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారపరంగా భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు లభించిన అవకాశాలు చివరినిమిషంలో చేజారుతాయి

మకర రాశి (Capricorn) :

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధుమిత్రులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భూ సంబంధిత విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు

కుంభ రాశి (Aquarius) :

పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు

 

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి సమయానికి విశ్రాంతి లేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read: Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 23-06-2021 బుధవారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage