2024-07-27 04:35:52
Today Horoscope : 19-07-2021 సోమవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 19-07-2021 సోమవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 19-07-2021 సోమవారం .. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA 19-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన ప్రతి పనిలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

వృషభ రాశి (Taurus) :

స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిధున రాశి (Gemini) :

వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి . సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. ధన విషయాలలో పొదుపుగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

కర్కాటక రాశి (Cancer) :

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సహాయ సహకారముతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో అవరోధాలను అధిగమించి లాభాల అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీరుస్తారు.

సింహ రాశి (Leo) :

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సోదరులతో సంతాన వివాహ విషయాల గురించి చర్చ చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు.

కన్య రాశి (Virgo) :

ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి కొంత ఆశ్చర్యకర సమాచారం అందుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

సంతాన విద్యా విషయాలలో శుభ వార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలను ధైర్యంగా వ్యవహరించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు.ధన పరమైన వ్యవహారాలు కలిసివస్తాయి. ఒక విషయంలో మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార విస్తరణప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి ఉద్యోగస్తులకు సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం ఉండదు.ఋణ ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మకర రాశి (Capricorn) :

స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపార వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభ రాశి (Aquarius) :

దీర్ఘకాలిక రుణాలు ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన మీ మనసును కలచి వేస్తుంది. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.

మీన రాశి (Pisces) :

ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (18-07-2021 నుంచి 24-07-2021 వరకు)

Also Read : Today Panchangam : 19-07-2021 సోమవారం … నేటి పంచాంగం..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage