2024-07-27 01:47:47
Today Horoscope : 11-05-2021 మంగళవారం నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 11-05-2021 మంగళవారం నేటి రాశిఫలాలు..

Today Horoscope : 11-05-2021  మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

SREE KRUPA (11-05-2021) రాశి ఫలితాలు

మేషం :

చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

వృషభం :

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

మిధునం :

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ధనాదాయం మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం :

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం :

చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య :

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది . చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

తుల :

కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగాలలో నూతనఅవకాశాలులభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం :

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు :

సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి.సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.

మకరం :

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసివస్తుంది. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభం :

ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలునిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

మీనం :

గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Panchangam : 11-05-2021 మంగళవారం .. నేటి పంచాంగం

Also Read :  Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage