2024-07-27 06:16:26
Today Horoscope : 04-08-2021 బుధవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 04-08-2021 బుధవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 04-08-2021 బుధవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (04-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఆర్థిక వ్యవహారాలు కలసిరావు. సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు తప్పవు. కొన్ని విషయాలలో అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది.

వృషభ రాశి (Taurus) :

కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిధున రాశి (Gemini) :

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయట మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

ధనాదాయం బాగుంటుంది ఒక వ్యవహారంలో ఇతరుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి లభిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు శారీరక మానసికంగా ప్రశాంతత పొందుతారు ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహ రాశి (Leo) :

ఇతరులతో ఏర్పడిన వివాదాలలో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు గురవుతారు ఆత్మవిశ్వాసంతో వ్యవహారాలలో విజయం సాదిస్తారు నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి (Virgo) :

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి పితృ వర్గం వారి నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు వ్యవహరించాలి వాహన ప్రయాణాలు విషయంలో తొందరపాటు మంచిది కాదు.

వృశ్చిక రాశి (Scorpio) :

సమాజంలో పేరుకలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు జీవితభాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి (Sagitarus) :

వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి ఒక వ్యవహారంలో బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మకర రాశి (Capricorn) :

సంతాన ఆరోగ్య విషయాలు కొంత మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి (Aquarius) :

మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచి వేస్తాయి.ఋణదాతల ఒత్తిడి అధికమౌతుంది.

మీన రాశి (Pisces) :

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్నివైపుల నుండి మంచే జరుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (01-08-2021 నుంచి 07-08-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 04-08-2021 బుధవారం … నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage