2024-07-27 15:31:53
Today Horoscope : ఆ రాశివారికి అవసరానికి ధనసహాయం ( 29-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశివారికి అవసరానికి ధనసహాయం ( 29-03-2022 )

Today Horoscope : ఆ రాశివారికి అవసరానికి ధనసహాయం ( 29-03-2022 )

SREE KRUPA (29-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 29-03-2022

Today Horoscope : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాల ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు.

వృషభం – 29-03-2022

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది వ్యాపారాలు లాభాలబాట పడతాయి ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది.

మిధునం – 29-03-2022

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.రుణ భారం అధికమౌతుంది. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి.

కర్కాటకం – 29-03-2022

సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి.

సింహం  – 29-03-2022

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు.

కన్య – 29-03-2022

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి.

తుల – 29-03-2022

వృధా ఖర్చులు పెరుగుతాయి.దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

వృశ్చికం – 29-03-2022

ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారామున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

ధనస్సు – 29-03-2022

కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కారమౌతాయి.

మకరం – 29-03-2022

జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం – 29-03-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆత్మీయులు తో శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్ధిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

మీనం – 29-03-2022

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

Girish (Purohithulu) sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

 

For More Updates Follow us on – Sirimalli Page